మెగా మేనల్లుడు, సుప్రీం హీరో తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన వైష్ణవ్.. డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో మెగా హీరో దొరికాడని అంతా అనుకున్నారు.అనూహ్యంగా రెండో సినిమాగా కొండాపొలం మూవీ చేసి ప్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు వైష్ణవ్.ఇక  దాంతో మూడో సినిమాగా యూత్ ఫుల్ లవ్ స్టోరీ చేద్దామనుకొని ‘రంగ రంగ వైభవంగా’ మూవీ చేశాడు.అయితే డైరెక్టర్ గిరీశాయ తెరకెక్కించిన ఈ లవ్ డ్రామా పాటలు, ట్రైలర్ తో ప్రేక్షకులలో అంచనాలు క్రియేట్ చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద రొటీన్ మూవీగా మిగిలిపోయింది.

 ఇక ఈ సినిమాలో వైష్ణవ్ సరసన హీరోయిన్ గా కేతికా శర్మ నటించింది. కాగా వైష్ణవ్, కేతిక ఇద్దరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ వర్కౌట్ అయినప్పటికీ, కథాకథనాలలో దమ్ము లేకపోయేసరికి సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయిందిఅంతేకాదు . దీంతో అటు వైష్ణవ్ కి, ఇటు కేతికకు వరుసగా మరో ప్లాప్ ఖాతాలో పడినట్లయింది. థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ ఈ మధ్య కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ  సినిమా హిట్టయినా, ప్లాప్ అయినా ఎప్పుడో ఒకప్పుడు ఓటిటిలోకి రావాల్సిందే. అయితే ఇప్పుడు రంగ రంగ వైభవంగా మూవీ ప్లాప్ అయ్యేసరికి.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటిలో రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్.

ఎవరి సినిమా అయినా ఓటిటి ప్రేక్షకుల దృష్టిలో ఒక్కటే. ఇక ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందని మాత్రమే ఆలోచిస్తుంటారు.ఇదిలా వుండగా ఈ క్రమంలో రంగ రంగ వైభవంగా మూవీకి సంబంధించి ఓటిటి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.ఇక  ఈ మెగా మేనల్లుడి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద సినిమా హిట్ అయితే.. ఎప్పుడు వచ్చేదో తెలియదు.  నిరాశ పరచినందుకు వీలైనంత త్వరగా ఓటిటి రిలీజ్ చేసే ప్లాన్ లో నెట్ ఫ్లిక్స్ వారున్నట్లు తెలుస్తుంది.ఇదిలావుంటే. ఈ నేపథ్యంలో రంగ రంగ వైభవంగా మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 5 లేదా 7 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: