టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తమన్నా కూడా ఒకరు. వయసు పెరుగుతున్న కొద్దీ సినిమా అవకాశాలు కూడా పెంచుకుంటూ వెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తమన్నా సక్సెస్ రేటు మాత్రం ఎక్కువగానే ఉందని మనం చెప్పవచ్చు.

కానీ ఈ మధ్యకాలంలో అధికాస్త చాలా 0తగ్గింది. స్టార్ హీరోలతో కలిసి నటించిన సినిమాలలో ఎక్కువగా ఫ్లాప్ రిజల్ట్ నే చూశాయి. ఇక ఈమె నటించిన ఊసరవెల్లి,ఆగడు, బద్రీనాథ్, రెబల్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర గోరపరాజయాన్ని చూశాయి. ఇక దీంతో కథలు ఎంపిక విషయంలో తమన్నా తప్పులు చేయడం వల్లే ఈమెకు ప్లాపులు కారణమని కొంతమంది అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.

 
ఇక అటు తర్వాత బాహుబలి, బాహుబలి 2- f-2, మినహా ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ తెచ్చిన సినిమాలు లేవు. ప్రతిభ ఉన్న నటి కావడంతో తమన్నా నాకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇక సినిమాలే కాకుండా పలు టీవీ షోలకు కూడా హోస్టుగా వ్యవహరించింది. అయితే అవి కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది తమన్నా. పలు వెబ్ సిరీస్ లలో నటించింది. ప్రస్తుతం చిన్న హీరోలతో కలిసి పలు సినిమాలలో నటించడానికి కూడా సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగుపెట్టగా అక్కడ కూడా భారి డిజాస్టర్ లను సొంతం చేసుకుంది

ఇక రీసెంట్ గా తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా విడుదల అవ్వగా ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలి పోయింది ఇక తమన్నాకు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తమన్నాను నిలబెట్టేలేక పోతున్నారని కామెంట్లు బాగానే వినిపిస్తున్నాయి. తమన్నా కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నారు .ఈ ముద్దుగుమ్మ ఒక చిత్రానికి రూ.2 కోట్ల రూపాయల వరకు రెమ్యూనికేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలని అభిమానుల సైతం తమన్నా కు  సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: