మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలను ఓకే చేస్తూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని ... అదిరిపోయే రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియా గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ యొక్క షూటింగ్ "ఆర్ సి 15" అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం జరుగుతుంది. ఈ మూవీ టైటిల్ ను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.  ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే రామ్ చరణ్ తన 16 వ మూవీ కి సంబంధించిన ప్రకటనను కూడా విడుదల చేసిన విషయం మనకు తెలిసింది. రామ్ చరణ్ తన 16 వ మూవీ ని ఉప్పెన మూవీ తో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేయబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించి రామ్ చరణ్ కొన్ని కీలక విషయాలను చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ తాజాగా ఆర్ సి 16 మూవీ గురించి మాట్లాడుతూ ... ఈ మూవీ లో నేను మరో అదిరిపోయే పాత్రను చేయబోతున్నాను అని ... ఆ పాత్ర రంగస్థలం మూవీ లో పాత్ర కంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మూవీ యొక్క షూటింగ్ సెప్టెంబర్ నెల నుండి ప్రారంభించబోతున్నాము అని కూడా రామ్ చరణ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: