సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది వరకే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండు మూవీ లు తెరకెక్కడం ... ఆ రెండు మూవీ లకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి.

 ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాల కు అనుగుణం గానే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ... అదిరిపోయే కథతో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు ఈ మూవీ యూనిట్ ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఈ మూవీ షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది.

 ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై ఉన్న అంచనాల కారణంగా ఈ మూవీ ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఈ మూవీ యొక్క ఆడియో రైట్స్ ను ఒక ప్రముఖ ఆడియో సంస్థ 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ రేంజ్ లో ఈ మూవీ ఆడియో రైట్స్ కు ధర రావడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ ఆఖరి సినిమా అయినటువంటి అలా వైకుంఠపురంలో మ్యూజిక్ అదిరిపోయే రేంజ్ లో బ్లాక్ బాస్టర్ అవడంతో ఈ మూవీ ఆడియో రైట్స్ కి ఈ రేంజ్ ధర వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: