
అంతలా విక్రమ్ తన పాత్ర పైన ఫోకస్ చేసి నటిస్తూ ఉంటారు.. చాలా రోజుల తర్వాత హిట్ డైరెక్టర్ తో కలిసి సినిమా చేయబోతున్నారు. కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ అయిన పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్నారు ఈ సినిమాకి తంగలాన్ స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా పైన మంచి బస్ ఏర్పడింది విక్రమ్ కెరియర్ లోనే మోస్ట్ హైయెస్ట్ మూవీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. మాళవిక మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు సినీ ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
కోలార్ గోల్డ్ ఫిష్ నేపథ్యంలో డిజైన్ చేసిన పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న తంగలాన్ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఏప్రిల్ 17వ తేదీన విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అప్డేట్ ను ఇస్తున్నట్లు మేకర్స్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.. ఈ సందర్భంగా మేకర్ ఒక కొత్త పోస్టర్ని విడుదల చేస్తూ విక్రమ్ ఇందులో చాలా రగ్గడ్ గా కనిపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ స్టైల్ లో మాస్ యాక్షన్ చూపిస్తూ రంజిత్ అండ్ రాక్స్టిక్ యాక్షన్ చూపించబోతున్నట్లు సమాచారం.