
ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాతో డైరెక్టర్ అట్లీ కి ఉత్తమ నూతన దర్శకుడిగా స్క్రీన్ ప్లే రచయితగా పేరు ప్రఖ్యాతలు లభించడమే కాదు విజయ్ అవార్డు కూడా లభించింది. ఇక తర్వాత 2016లో తేరీ, 2017లో మెర్సల్ , 2019లో బిగిల్ ఇలా మూడు చిత్రాలు చేసి విజయ్ తో భారీ విజయాన్ని అందుకున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో ఇటీవల పాన్ ఇండియా చిత్రం జవాన్ కి కూడా దర్శకత్వం వహించి షారుక్ ఖాన్ కు మరొక రికార్డును అందించారని చెప్పవచ్చు.
అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో షారుక్ ఖాన్ కూడా బాలీవుడ్ లో భారీ పాపులారిటీ దక్కించుకోవడమే కాదు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. ఇకపోతే అట్లీ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే నటి కృష్ణప్రియను 9 2014న వివాహం చేసుకున్న ఈయన 2023 జనవరి 31వ తేదీన ఒక కుమారుడికి జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం విజయ్ తో మరొక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అట్లీ.. మరి ఈ సినిమాతో ఆయన ఇంకా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.