తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అలాగే ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసే విధంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్లాన్ చేస్తూ వచ్చారు. ఇకపోతే తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ ని మొదట సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ విడుదలను వాయిదా వేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను సెప్టెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

దానితో సైంధవ్ మూవీ మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ నెలలో కాకుండా ఆ తర్వాత సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని సెట్ అయితే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుక జనవరి 13 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాపై వెంకటేష్ అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: