తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కౌర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఎందుకంటే ఈమె సినిమాలలో కంటే ఎప్పుడు ఏదో ఒక వివాదంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. తెలుగు, తమిళ్ ,మలయాళం వంటి భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ అనుకోకుండా కొన్ని కారణాల చేత ఈమె ఇండస్ట్రీ నుంచి దూరమైపోయింది.అప్పటి నుంచి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల వివాదాస్పదమైన పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి కూడా చురుకుగా పాల్గొంటూ ఉంటుంది పూనమ్ కౌర్.


అలాగే తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి పలు విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది.. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్ వేదికగా ఒక షాకింగ్ వీడియో ని షేర్ చేసింది.. ఈ వీడియోలో ఆరోగ్యమే మహాయోగం అనే కార్యక్రమంలో భాగంగా తను ఒక భయంకరమైన వ్యాధి తో బాధపడుతున్నట్లు తెలియజేసింది.. ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి వల్ల దాదాపుగా రెండేళ్ల పాటు చాలా ఇబ్బందులు పడ్డానని తెలియజేసింది. ఈ జబ్బు వల్ల బట్టలు వేసుకోవడానికి కూడా వీలు ఉండేది కాదని..


అసలు మూమెంట్సే ఉండవు లూజు బట్టలే వేసుకోవాలని చాలా ఎమోషనల్ గా తెలిపింది.. నేచోతెరపి లెజెండ్ డాక్టర్ మంతెన గారిని కలవడం తనకి చాలా ఆనందాన్ని కలిగించిందని.. ఫైబ్రోమైయాల్జియా వైద్యానికి సంబంధించిన ఆయన ఇచ్చిన సూచనలు చాలా గొప్పవి.. మంచి మనసు గల వ్యక్తితో ఒక ఎపిసోడ్లో ఇలా పాల్గొనడం అనేది తన అదృష్టంగా భావించనీ ఒక ట్విట్టుని సోషల్ మీడియాలో రాసుకురావడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఈ శనివారం ప్రసారం కాబోతోంది తనకు మాత్రం ఒక అరుదైన వ్యాధితో బాధపడినట్లుగా పూనమ్ కౌర్ విషయం విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అభిమానులు మాత్రం తెలుగులో నటించాలని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: