
అయితే ఇటీవలే ఎన్టీఆర్ మ్యాడ్స్ స్క్వేర్ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లుక్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ధరించినటువంటి రెడ్ అండ్ బ్లాక్ చెక్స్ షర్ట్ అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ షర్టు గురించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ షర్టు ధర ఎంత ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలని తెగ వెతికేస్తూ ఉన్నారు.
అయితే తాజాగా ఎన్టీఆర్ ధరించిన ఈ షర్టు ధర 14,999 రూపాయలు ఉన్నది. ఈ షర్టు బ్రాండ్ ALL SAINTS బ్రాండ్ నుంచి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అభిమానులు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ గా చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా అని ప్రారంభించడం జరిగింది అందుకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుకాగ కొద్దిగా గ్యాప్ ఇచ్చి తిరిగి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే దేవర 2 సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ కి సంబంధించి ఏదో ఒక విషయంలో వైరల్ అవుతున్నారు.