
ఎప్పుడు వచ్చాం ... ఎప్పుడు మొదలు పెట్టడం అన్నది కాదు .. బుల్లెట్ దిగిందా లేదా .. ఇది పాత డైలాగ్ . ఎలా వచ్చాం అన్నది కాదు .. హిట్ కొట్టామా ? లేదా ? అన్నది ఇప్పుడు హీరోయిన్లు పదే పదే వాడుతున్న కొత్త మాట .. అయితే ఇక్కడ ఎలా వచ్చామని ఎందుకు అన్నట్టు అని ఆలోచిస్తున్నారా .. అదే ఇక్కడ మాట్లాడుకుందాం .. రజినీకాంత్ కూలీ సినిమా తో ప్రేక్షకులను పలకరించడాని కి గొంతు సవరించుకుంటున్నారు హీరోయిన్ శృతిహాసన్ ఆగస్టు 14 న ఈ సినిమా తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది శృతిహాసన్ . అలాగే అదే డేట్ కి వార్ 2 తో మరోసారి ప్రేక్షకులకు హాయ్ చెప్పేనున్నారు కియారా అద్వానీ .. ఈ సంక్రాంతి గేమ్ చేంజర్ ప్లాఫ్ అవడం తో వార్ 2 మీదే ఈమె ఆశలు పెట్టుకుంది .. కాబోయే తల్లి ..
ఇదే క్రమంలో నెక్స్ట్ తెలుగు రిలీజ్ లు ఏమున్నాయి అంటూ ఈ మధ్య తిరుపతి లో పూజ హెగ్డే ను అడిగితే .. ఈమె మాత్రం ఎక్కడా తడబడకుండా రెట్రో పేరు చెప్పేసింది .. రెట్రో ని మనవాళ్లు తమిళ సినిమా గా చూస్తుంటే పూజ మాత్రం ఇది కంప్లీట్ తెలుగు సినిమా గానే ఫీలవుతుంది .. అలాగే ధనుష్ ఇడ్లీకడైతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది మరో బ్యూటీ నిత్యామీనన్ .. అలాగే రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ అందుకున్న త్రిష . తర్వాత థగ్‌లైఫ్‌కోసం ఎదురుచూస్తుంది .. ps 1, ps 2 సినిమాల తర్వాత మణిరత్నం డైరక్ట్ చేస్తన్న థగ్‌లైఫ్ లో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. అలాగే రీసెంట్గా ఓదెల 2 తో ప్రేక్షకులను పలకరించిన తమన్నా .. మే 1న రైడ్ 2 తో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతుంది .. ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది .. ఇప్పటికే ఈ సాంగ్ భారీ స్థాయిలో అప్లాజ్ అందుకుంది ..