ప్రస్తుతం మన సినిమాలు రేంజ్ మారిపోయింది .. బడ్జెట్ సక్సెస్ విషయంలో మాత్రమే కాదు .  ప్రొడక్షన్లోనూ మన మేకర్స్‌ కొత్త హైప్స్ కు తీసుకువెళ్తున్నారు .. ఇప్పటివరకు పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉన్న లెక్కలు ఇప్పుడు గ్లోబల్ రేంజ్ కు మారుతున్నాయి .. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ వినియోగంలో మన మేకర్స్ కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసుకుంటున్నారు . అలాగే భారతీయ సినిమాకు కొత్త బౌండరీస్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు రాజమౌళి బడ్జెట్ మేకింగ్ మార్కెటింగ్ సక్సెస్ ఇలా ప్రతి విషయంలోనూ తన ముద్ర కచ్చితంగా కనిపించేలా చూసుకుంటున్నాడు ..


ప్రధానంగా సినిమా కథకు విజువ ల్ ఎఫెక్ట్స్ వాడికోటంలో రాజమౌళిది అందరికన్నా సపరేట్ స్టైల్ .. ఈగను మెయిన్ హీరోగా చూపించిన ఎన్టీఆర్ , పులి మధ్య యాక్షన్ ప్లాన్ చేసిన అది రాజమౌళికి దక్కింది .. ఇక ఎప్పుడూ తన తర్వాత సినిమాతో మరో విజువల్ వండర్ ఇవ్వబోతున్నాడు రాజమౌళి .. మహేష్ తో గ్లోబల్ రేంజ్ లో సినిమాను ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఈసారి ఏకంగా డైనోసార్ తో ఫైట్  సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారట .. యాక్షన్ ఫాంటసీ డ్రామా కాబట్టి కాస్త సినిమాటిక్ లిబర్టీ వాడుకోబోతున్నారు .. అందుకోసం ఇండియన్ కంపెనీస్ తో పాటు ఫారిన్‌ వీఎఫ్ఎక్స్‌ టీమ్స్ తోను కలిసి పని చేయబోతున్నారు ..


అలాగే మన సినిమాల‌ను మరో లెవల్‌కు తీసుకువెళ్తున్న మరో విజువల్ వండర్ ఏఏ 22 . పుష్ప 2 తో నేషనల్ మార్కెట్ను షేక్‌ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ మీద‌ కూడా దృష్టి పెట్టాడు .. అందుకే అదే రేంజ్ సినిమాను రెడీ చేస్తున్నాడు .. విజువల్ గా ఇండియన్ స్క్రీన్ ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయని కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాడు .. ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో తోనే అంచనాలు పెంచేసింది అట్లీ టీం .. ఇక ఈ సినిమా 2 పార్లర్ వరల్డ్స్ లో జరిగే ఫాంటసీ కథ‌ అన్న ప్రచారం కూడా జరుగుతుంది .. ఇక ఇదే నిజమైతే వీఎఫ్ఎక్స్‌కు మాక్సిమం ఎక్కువ స్కోప్ ఉంటుంది దానికి తగ్గట్టుగా ప్రీ ప్రొటెక్షన్ నుంచే ప్లానింగ్ చేసుకుంటుంది సినిమా టీం .. ఇలా మన మేకింగ్ స్టైల్ తో హాలీవుడ్ ని కూడా మనవాళ్లు గట్టిగా సవాల్ చేస్తున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: