పాన్ ఇండియా స్థాయి లో రికార్డులు క్రియేట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు తన నెక్ట్స్ స్టెప్ విషయం లో కొంత వెనుకబడ్డారా ? నేషనల్ లెవెల్ లో వచ్చిన క్రేజ్ ప్రభాస్ ఫ్యూచర్ కు ఎఫెక్ట్ చేయనుందా ? ప్రభాస్ తడబడిన స్పేస్లో ప్రూవ్ చేసుకుంటున్న స్టార్లు ఎవరు ? ఇలాంటి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం .. ప్రస్తుత జనరేషన్ కు పాన్ ఇండియా అన్న పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ మాత్రమే .. అలాగే దర్శక నిర్మాతలకు వందల కోట్ల బడ్జెట్ పెట్టొచ్చు అన్న ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చిన హీరో కూడా యంగ్ రెబల్ స్టార్ ..


ఇక ఇండియన్ సినిమా మార్కెట్ మీద ఈ స్థాయి లో ప్రభావం చూపించిన ప్రభాస్ గ్లోబల్ రేంజ్‌లో కూడా ప్రూవ్ చేసుకోవడంలో మాత్రం కొంత తడబడుతున్నాడు .. ఇక రాజమౌళి , మహేష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గ్లోబల్ రేంజ్ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది .. చిత్ర యూనిట్ .. అలాగే తన తర్వాత సినిమా అనౌన్స్మెంట్ వీడియో తోనే అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ  రేంజ్ లో ఉంటుందో రివిల్ చేసింది సినిమా యూనిట్ .. ఇక ఈ సినిమాల తో ప్రభాస్ కంటే ముందే గ్లోబల్ మార్కెట్లో కి ఎంట్రీ ఇస్తున్నారు మహేష్ , బన్నీ .. అలాగే గ్లోబల్ రెంజ్‌  లో  ప్రూవ్ చేసుకోవటం లో ప్రభాస్ ను ఇబ్బంది పెడుతుంది ఆయన కొన్న పాన్ ఇండియా ఇమేజ్ అని కూడా అంటున్నారు ..


అలాగే ఈ జనరేషన్ లో నేషనల్ లెవెల్ లో ఫాలోయింగ్ అందుకున్న తొలి హీరో ప్రభాస్ మాత్రమే కావడం తో ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు తెగ క్యూ కడుతున్నారు .. ఇక ప్రభాస్ కూడా ఎక్కువ ప్రాజెక్ట ల‌కు ఒకే చెప్పేసి లైన్లో పెట్టేస్తున్నాడు ..వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో గ్లోబల్ రేంజ్ ప్రాజెక్ట్స్ కు టైం ఇవ్వలేకపోతున్నాడు ప్రభాస్ కల్కి లాంటి సినిమాలు కంటెంట్ పరంగా మేకింగ్ పరంగా గ్లోబల్ రేంజ్ లో కనిపిస్తున్న కంటెంట్ ఇండియన్ నేటివిటీకి సంబంధించింది కావడం తో గ్లోబల్ రేంజ్  ప్రాజెక్ట్ కావడం లేదు .. అందుకే డార్లింగ్ నుంచి కూడా ఆ రేంజ్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన డై హార్ట్ ఫ్యాన్స్ ..

మరింత సమాచారం తెలుసుకోండి: