టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి సోనాల్ చౌహన్ ఒకరు. ఈ చిన్నది 2008 సంవత్సరంలో విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన రెయిన్ బో సినిమా ద్వారా తెలుగులోకి ఎంటట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తనదైన అందం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. ఆ సినిమా అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలోను హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాతో సక్సెస్ సాధించిన ఈ చిన్నదానికి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. 

అనంతరం పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో, డిక్టేటర్, ఎఫ్-3, రూలర్, గోస్ట్, ఆది పురుష్ లాంటి అనేక సినిమాలలో ఈ చిన్నది నటించి సక్సెస్ సాధించింది. గత సంవత్సరం బెంగాలీ, హిందీలలో తెరకెక్కిన దార్ద్ సినిమాలోనూ ఈ చిన్నది నటించి మంచి గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా.... సోనాల్ చౌహన్ 2013లో "3G ఏ కిల్లర్ కనెక్షన్" అనే సినిమాలో సోనాల్ చౌహన్ నటించింది. ఇందులో నీల్ నితిన్ ముఖేష్ హీరోగా చేశారు. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ రికార్డ్ బ్రేకింగ్ గా ఈ సినిమాలో 30 కిస్ సీన్లు ఉన్నాయి.

గతంలో ఇమ్రాన్ హష్మీ, మల్లికా శెరావత్ సినిమా మర్డర్ సినిమాలో అత్యధికంగా 20 కిస్ సీన్లు ఉండగా... ఆ రికార్డును 3G సినిమా 30 కిస్ సీన్స్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం సోనాల్ చౌహన్ తమిళ్, కన్నడ భాషా సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందుతోంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ గా మారుతాయి. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. సోషల్ మీడియాలో ఈ చిన్న దానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: