
బారి సెట్లో రమణగింది బీచ్ లో కూడా నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా సలార్, కేజిఎఫ్ లకు మించి మరీ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రతిరోజు ఉదయం 7:00 నుంచి సాయంత్రం 7:00 వరకు జరుగుతోందట. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్లోకి ఎవరిని కూడా బయటి వారిని అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత నటిస్తోంది. గతంలో ప్రశాంత్ నీలి చిత్రాలకు సంగీతాన్ని అందించిన రవి బన్సూర్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారట.
ప్రశాంత్ నిల్ ఈ సినిమా షూటింగ్ కోసం తన పాత టీమ్ ని ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.దాదాపుగా రెండు నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యిందని జూనియర్ ఎన్టీఆర్ వారం క్రితం సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా యాక్షన్ సినిమా గా ఉండబోతోందని ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏడాది చివరికి పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వచ్చే ఏడాది పూర్తి చేసి ఏప్రిల్ నాటికి విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.