హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయనకు చాలా ఎక్కువ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే ఎదురవుతూ వస్తుంది. తాజాగా అక్షయ్ కుమార్ "కేసరి చాప్టర్ 2" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మాధవన్ , అనన్య పాండే ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది.

దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది భావించారు. కానీ ఈ మూవీ కి ప్రేక్షకులు భావించిన విధంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు రావడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 8 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు కేవలం 50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇలా ఈ సినిమాకు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చినా కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు మాత్రం దక్కడం లేదు. దానితో 8 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి కేవలం 50 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే దక్కాయి.

మరి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఏదేమైనా కూడా ఈ మూవీ.లో అక్షయ్ కుమార్ , మాధవన్ , అనన్య పాండే నటనలకు మాత్రం ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: