స్నేహ రెడ్డి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఆమె హీరోయిన్ కాదు రాజకీయనేత అంతకన్నా కాదు.. కానీ తన సింపుల్ లైఫ్ స్టైల్ తోనే ఒక స్టార్ హీరోకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతకుమించిన రేంజ్ లోనే స్నేహారెడ్డిని  ఫాలో అవుతూ ఉంటారు జనాలు. ముఖ్యంగా ఆమె పిల్లలను పెంచే పద్ధతిని చాలామంది అనుసరిస్తూ ఉంటారు.


స్నేహారెడ్డి పిల్లల్ని చాలా బాగా పెంచుతుంది . ప్రతి ఒక్క విషయాన్ని చాలా కేర్ఫుల్ గా తీసుకుంటూ వాళ్లకు అర్థమయ్యేలా వివరిస్తుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో స్నేహ రెడ్డికి సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. స్నేహ రెడ్డి కారణంగానే అల్లు అర్జున్ ఓ బిగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . ఎస్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బిగ్ హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది .



అల్లు అర్జున్ త్వరలోనే దుబాయ్ లో సెటిల్ కాబోతున్నాడు అన్న వార్త గత 76 గంటల నుంచి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆయన లైఫ్ లో జరిగిన కొన్ని కొన్ని ఇష్యూస్ కారణంగా టోటల్గా దుబాయ్ లోనే సెటిల్ అయిపోవాలి అంటూ ట్రై చేస్తున్నారట .సినిమాలు చేస్తాడే కానీ పర్సనల్ లైఫ్ అంతా కూడా అక్కడ సెటిల్ అయ్యే విధంగా ఆలోచిస్తున్నారట . అల్లు అర్హ - అల్లు అయాన్ చదువులు మొత్తం కూడా దుబాయ్ లోనే ప్లాన్ చేసే విధంగా పూర్తిగా మాట్లాడేసుకున్నారట . ఆల్రెడీ దుబాయ్ రెండు ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .



నిజానికి ఈ ఆలోచన బన్నీది కాదట.  స్వయాన స్నేహ రెడ్డినే దుబాయ్లో సెటిల్ అవుదాం అన్న విషయాన్ని బన్నీ ముందుకు తీసుకొచ్చిందట . కొంతమంది బన్నీ ఫాన్స్ కూడా ఇదే విషయాన్ని హాట్ హాట్ గా డిస్కస్ చేస్తున్నారు . స్నేహ రెడ్డి పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది.  ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు.  ఈ మధ్యకాలంలో కొంతమంది బన్నీ ఇంటిపై అటాక్ చేశారు . దానివల్ల అల్లు అర్హా- అల్లు అయాన్ మనసు దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి . ఆ కారణంగానే స్నేహారెడ్డి ఇలాంటి డిసిషన్ తీసుకొని ఉండొచ్చు అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: