యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్.. ఆ వెంటనే బాలీవుడ్లోకి అడుగుపెట్టి వార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొన్ననున్నారు.కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం ముంబైలోనే ఎన్టీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో బాలీవుడ్లో కూడా ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు.


స్పై యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే  బారి హైప్స్ ఏర్పడుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్లో సరికొత్తగా అభిమానులను సందడి చేయబోతున్నట్లు తెలుస్తున్నది. సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పైనే ఫుల్ ఫోకస్ పెట్టేలా ప్లాన్ చేశారు. ఏప్రిల్ 22న ఈ సినిమా షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టబోతున్నారు ఎన్టీఆర్.


మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ రాబోతున్నట్లు చిత్ర బృందం నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ చేయబోతున్నారు తాజాగా ఈ సినిమా నుంచి ఒక న్యూస్ అయితే ఇప్పుడు మరొకసారి వైరల్ గా మారుతున్నది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోందని సమాచారం. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ని కూడా పరిశీలిస్తున్నారు. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం కొంతమేరకు సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నిటిలో కల్లా ఈ సినిమా బెస్ట్ అవుతుందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత నటిస్తూ ఉన్నది. మరి రష్మిక స్పెషల్ సాంగ్ కనిపిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: