
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కాగా ఇందులో భాగంగానే సినిమాకి "భోగి" అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు . అఫీషియల్ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్ లో శర్వానంద్ చాలా డిఫరెంట్ యాంగిల్ లో చూపించారు . డైరెక్టర్ పక్క వైలెంట్ మూవీ అని అర్థం వచ్చేలా "బ్లడ్ ఫెస్ట్" అని కూడా ఇచ్చారు . అయితే టైటిల్ ట్యాగ్ విషయం పక్కన పెడితే శర్వానంద్ న్యూ మూవీ ఇప్పుడు అందరికీ కొత్త డౌట్లు క్రియేట్ చేస్తుంది. శర్వానంద్ బాగా బరువు తగ్గిపోయాడు . స్లిమ్ గా అవ్వడం కాదు బాగా బక్కపలుచగా మారిపోయారు .
అసలు శర్వానంద్ ని చూసి ఇతడికి ఏదైనా జబ్బా..? అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు జనాలు. అంతలా తగ్గిపోయారు . అయితే ఇదంతా కూడా భోగి సినిమా కోసమే అంటూ న్యూస్ బయటకు వచ్చింది. భోగి సినిమా కోసం ప్రత్యేకంగా అలీమ్ హక్కిమ్ ని కూడా రంగంలోకి దించాడు సంపత్ నంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అతని ఆధ్వర్యంలోనే శర్వానంద్ ఇలా అయిన్నట్లు కూడా తెలుస్తుంది . అయితే ఎంతో వైలెంట్ సినిమా అయినా ఫిజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ .హీరో కత్తి పడితే ఎంత పదునుగా ఉంటుందో కత్తి పట్టిన హీరో కూడా ఫిజిక్ విషయంలో అంతే పదునుగా ఉండాలి. అప్పుడే సినిమా చూడడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ శర్వానంద్ కి కత్తి పట్టుకునే అంత ఫిజిక్ ఉందా..? అనేది ఫాన్స్ డౌట్ . శర్వానంద్ ఫిజిక్ పరంగానే నెగిటివ్ ట్రోలింగ్ దక్కించుకుంటున్నాడు. మరి ఇంత వైలెన్స్ మూవీలో ఆయన ఫిజిక్ సపోర్ట్ చేస్తుందా..? అనేది పిక్ క్వశ్చన్ వర్క్. అంతే కాదు ఫ్యామిలీ హీరో కి ఇలాంటి వైలెన్స్ మూవీ ఏంటి ..? శర్వా తన ఫ్యాన్ బేస్ ని మర్చిపోయాడా..? అనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. శర్వానంద్ డిఫరెంట్ జోనర్ లో సినిమాని టచ్ చేయాలి అన్న ఆలోచన బాగానే ఉన్నా ఫిజికే ఇప్పుడు కొంప ముంచేతబోతుంది అనే రేంజ్ లో జనాలు ట్రోల్ చేస్తున్నారు..!