
అయితే సోషల్ మీడియాలో పదే పదే దీని గురించి డిస్కషన్ జరుగుతూ ఉండడంతో మొత్తానికి వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దీనిపై స్పందించారు. అసలు విషయాని ఓపెన్ గా బయట పెట్టారు. లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తాను తల్లి కాబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది . త్వరలోనే గుడ్ న్యూస్ అంటూ కొత్త రోల్ ప్రారంభం కాబోతుంది నా జీవితంలో అంటూ పోస్ట్ పెట్టింది . అంతేకాదు వరుణ్ చేతిని గట్టిగా పట్టుకున్న లావణ్య త్రిపాఠి..రెండు షూస్ ని కూడా పోస్టులో జత చేశారు .
దీంతో వీళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫామ్ అయిపోయింది . సోషల్ మీడియాలో ఇప్పుడు లావణ్య త్రిపాఠిని - వరుణ్ తేజ్ ని స్టార్ సెలబ్రెటీస్ విష్ చేస్తున్నారు. అయితే లావణ్య త్రిపాఠికి ఎన్నో నెల అంటూ చర్చించుకుంటున్నారు జనాలు. అంతేకాదు లావణ్య త్రిపాఠి కి ఆరు నెలలు కంప్లీట్ అయ్యాయి అని.. త్వరలోనే ఏడో నెలలో అడుగుపెట్టబోతుంది అని డాక్టర్ దగ్గర నుంచి పూర్తి కన్ఫర్మేషన్ తీసుకున్నాక బేబీ అంత హెల్తీ ఉంది అన్న నిర్ణయానికి వచ్చాకే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది మెగా ఫ్యామిలీ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి పేరు ఇప్పూదు బాగా మారుమ్రోగిపోతుంది..!