న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మూవీలోని కొన్ని సీన్లు ఓ సీరియల్ నుండి తీసుకున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతుంది. హిట్ 3 సినిమాలో నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి మధ్య ఉన్న కొన్ని సీన్స్ ని సీరియల్ నుండి కాఫీ కొట్టారని అంటున్నారు. కార్ సీట్ బెల్ట్ పెట్టే సీన్.. అలాగే పానీ పూరి తినే సీన్ ఒకేలా ఉన్నాయి. మా టీవీలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ నుండి ఆ సీన్స్ ని డైరెక్టర్ కాపీ కొట్టారని అంటున్నారు. ఇక ఇన్ స్టాగ్రామ్ వేదికగా చెక్కర్లు కొడుతున్న ఆ వీడియో కి తెగ కామెంట్స్ వస్తున్నాయి. కొందరు మక్కీకి మక్కీ దింపేశారుగా అంటే.. మరికొందరేమో హిట్ 3 డైరెక్టర్ గుప్పెడంత మనసు సీరియల్ ఫాలో అవుతున్నారేమో అని అంటున్నారు.

హీరో నాని ఇటు హీరోగా మూవీస్ లో నటిస్తూనే.. అటు నిర్మాతగా సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీకి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. ఇప్పటికే హిట్ 1, హిట్ 2 సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి. దీంతో ఈ నెల 1న హిట్ 3తో హీరో నాని ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఒక్కో సీన్ గుస్ బంప్స్ వచ్చేలా ఉంది. హిట్ 3 మూవీ రికార్డ్ ని బద్దలుకొట్టింది. ఈ సినిమా విడుదల అయ్యి ఐదు రోజులు పూర్తి అయ్యింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. హిట్ : ది థర్డ్ కేస్ సినిమా కోట్లలో వసూలు చేస్తూ వస్తుంది.
 
ఈ హిట్ 3 సినిమా రిలీజ్ కి ముందే ఒక డిఫరెంట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు విడుదల అయ్యి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్ లో కనిపించిన నాని ఈ సినిమాలో మాస్ రోల్ లో మళ్లీ కనిపించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ప్రేక్షకులకు హిట్ 3 సినిమాపై పెట్టుకున్న అంచనలకు తగ్గట్టుగా సినిమాను తీశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: