ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా పాత సినిమాలలో నుంచి తమ ఫేవరెట్ సాంగ్ రీమేక్ చేస్తూ ఇప్పుడు వాళ్ళు నటించే సినిమాలలో ఆ పాటను రీమేక్ చేసి మరి పెట్టుకుంటున్నారు . అలా చాలామంది స్టార్ హీరోస్ చేస్తున్నారు . అయితే రామ్ చరణ్ కూసింత స్పెషల్ .  తన తండ్రి తన బాబాయ్ సినిమాలలోని  నుంచి హిట్ మూవీ టైటిల్స్ అలాగే హిట్ పాటలను తన సినిమా కోసం వాడేసుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. 


రామ్ చరణ్ తన "పెద్ది" సినిమా కోసం పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ పాటను రీమేక్ చేయబోతున్నారట . ఆ పాట మరేంటో కాదు "ఖుషి". ఈ సినిమాలో "అమ్మాయే సన్నగా".. ఈ పాటను రీమేక్  చేసి మరి "పెద్ది" సినిమాలో స్పెషల్ సాంగ్ గా రీ క్రియేట్ చేయబోతున్నారట.  దీనికి సంబంధించి అన్ని లీగల్ రైట్స్ అదేవిధంగా అన్ని విషయాలను కన్ఫర్మ్ చేసేసుకున్నారట మూవీ టీం. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతున్నారట .



రామ్ చరణ్ స్వయంగా ఇలా బాబాయ్ సినిమాలోని పాటను రీమేక్  చేయాలి అంటూ బుచ్చిబాబు సనాకు రిక్వెస్ట్ చేశారట . టైమింగ్ రైమింగ్ రెండు కలిసి రావడంతో బుచ్చిబాబు అందుకు ఓకే చేశారట. ఖుషి సినిమాలోని అమ్మాయే  సన్నగా పాట ఎంత హిట్ అయ్యింది అనే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పటికీ ఈ పాట విన్న గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఫీల్ ఉన్న పాట ఇది. మరోసరి ఈ పాట ను తెర పై చూస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ పవన్ అభిమానులకి ఇంకెం కావాలి..???

మరింత సమాచారం తెలుసుకోండి: