సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొన్ని వార్తలు నిజం కాకపోయినా సరే అవి ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.  కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో హీరోయిన్ తమన్నా పెళ్లి వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మనందరికీ తెలిసిందే మిల్కీ బ్యూటీ పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ కోట్లాది మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .


కానీ మిల్కీ బ్యూటీ మాత్రం ఆ కోరికను తీర్చడం లేదు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం అంటూ డేటింగ్ అంటూ కబురు చెప్పిన...పెళ్లి అనే తీపి కబురు మాత్రం చెప్పడానికి చాలా చాలా టైం తీసుకుంటుంది.  అయితే ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి . దానికి తగ్గట్టే రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో తమన్న పెళ్లి గురించి ప్రస్తావించగానే కొంచెం కోపంగా " అలాంటివి అడగద్దు" అంటూ యాంకర్ కు తేల్చి చెప్పేసింది.   ఇదే మూమెంట్లో సోషల్ మీడియాలో ఆమె పెళ్లికి సంబంధించిన కొన్ని పిక్స్ వైరల్ గా మారడం గమనార్హం.  బాలీవుడ్ ఇండస్ట్రీని ఈ పెళ్లి పిక్చర్స్ షేక్ చేస్తున్నాయి .



తమన్నా - విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత ఒక బడా బాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకుతో డీప్ గా ప్రేమలో మునిగి తేలుతుంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది . అయితే ఇప్పుడు తమన్నా పెళ్లి చేసేసుకుంది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని పెళ్లి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . గతంలో తమన్నా పెళ్లికి సంబంధించిన ఫేక్ పిక్స్ ఇలానే వైరల్ అయ్యాయి. అయితే రీసెంట్ గా వైరల్ అవుతున్న పెళ్లి పిక్స్  ఫేక్ అంటూ ఫ్యాన్స్ తెల్చేశారు. కొంతమంది మాత్రమే ఈ ఫొటోస్ చూసి నిజంగానే తమన్నాకు పెళ్లి అయిపోయిందా..? అంటూ షాక్ అయిపోతున్నారు . కానీ తమన్నా ఇన్సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ను అందుతున్న సమాచారం ప్రకారం తమన్నాకి పెళ్లి కాలేదు . ఇదంతా సోషల్ మీడియాలో మార్ఫ్ చేసిన ఫొటోస్ అంటూ క్లారిటీకి వచ్చింది . అయితే తమన్నా పెళ్లి ఫొటోస్ చూడడానికి చాలా రియల్ గా ఉండడంతో అందరు తమన్నాకి పెళ్లి అయిపోయింది అని అనుకుంటున్నారు . నిజానికి తమన్నా కి పెళ్లి కాలేదు . త్వరలోనే పెళ్లి చేసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: