
ఈ రౌడీ హీరోకి యాంగ్రీ హీరో రాజశేఖర్ కలిస్తే కచ్చితంగా ఈ కాంబో ఊహించని కొత్తగా ఉంటుంది . ఇక రాజశేఖర్ కు ఈ రీసెంట్ టైమ్స్ లో క్యారెక్టర్ విలన్ పాత్రలో బాగానే వస్తున్నాయి .. కాకపోతే ఆయనే వాటిని సరిగా ఒప్పుకోవటం లేదు . ఈమధ్య చాలా ఆఫర్లు రాజశేఖర్ వదులుకున్న సందర్భాలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి .. ఒకవైపు హీరోలా చేస్తూనే మరోవైపు ఇలాంటి క్రేజీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటే కచ్చితంగా రాజశేఖర్ మళ్ళీ తిరిగి ఫామ్ లోకివస్తారని కూడా అంటున్నారు ..
అయితే రౌడీ జనార్ధన్ ఫుల్ మాస్ యాక్షన్ మూవీ హీరోయిన్గా రష్మిక పేరు గట్టిగా వినిపిస్తుంది . ఇక రష్మిక నటిస్తే వీరిద్దరికి ఇది హ్యాట్రిక్ కాంబో అవుతుంది .. గీత గోవిందం , డియర్ కామ్రేడ్ తర్వాత విజయ , రష్మిక నటించే సినిమా కూడా ఇదే అవుతుంది .. అయితే ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరైన సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నార.. అయితే ఈ రౌడి హీరో కింగ్డమ్ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు .. ఇక మరి రౌడీ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి ..