కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఆఖరుగా తలపతి విజయ్ హీరో గా త్రిష హీరోయిన్గా రూపొందిన లియో అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈయన ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందుతున్న కూలీ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి లోకేష్ కనకరాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన రజనీ కాంత్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియచేశాడు. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా లోకేష్ కనకరాజు మాట్లాడుతూ ... సూపర్ స్టార్ రజినీ కాంత్ గారు నాకు ఎలాంటి అనుభూతిని కలిగించారో నేను అస్సలు వివరించలేను. రజనీ కాంత్ గారు నాకు అనేక విషయాల గురించి గొప్పగా తెలుసుకునే విధంగా చేశాడు. అలాగే రజనీ కాంత్ గారు నన్ను జీవితం గురించి ఆలోచింపజేసేలా చేశాడు.

ఆయనతో షూటింగ్ సమయంలో నేను ఏడ్చాను , నవ్వాను , ప్రతి రోజు ఏదో ఒక విషయం నేర్చుకుంటూ వచ్చాను అని లోకేష్ కనకరాజ్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే కూలీ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lk