
కాగా ఇప్పుడు అక్కినేని ఇంట మరొకసారి శుభకార్యం జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . నాగార్జున ఏం చేసినా సరే సైలెంట్గా పద్ధతిగా చేస్తూ ఉంటారు . తన రెండవ కుమారుడు అఖిల్ నిశ్చితార్ధం కూడా అంతే గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా చేసేసాడు . ఒక పోస్టుతో నా చిన్న కోడలు జైనబ్ రవ్జీ అంటూ అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. వీళ్ళ పెళ్లి నిజానికి మార్చిలోనే జరగాల్సింది . కానీ కొన్ని కారణాల చేత వాయిదా పడిందట . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం వీళ్ళ పెళ్లి ఆగస్టులో జరగబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది .
దానికి సంబంధించిన పనులు మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారట నాగార్జున - అమల అంటూ ఓ న్యూస్ బయటకి వచ్చింది. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఇండియాలో కాకుండా దుబాయ్ లో జరిపేలా ప్లాన్ చేస్తున్నారట . అక్కడ సెలబ్రిటీస్ అందరికీ తగిన సెక్యూరిటీ ఇవ్వగలము అని ఆ తర్వాత హైదరాబాద్లో పొలిటీషియన్స్ ..నాగార్జున పలుకుబడికి సంబంధించిన వ్యక్తులకు స్పెషల్ గా ఒక రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారట. ఆగస్టు లో అఖిల్ పెళ్లి జరగబోతుంది అన్న వార్త ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.