
విజయ్ దేవరకొండ కింగ్ డమ్, అనుష్క ఘాటీ, నితిన్ తమ్ముడు సినిమాలతో పాటు చిరంజీవి విశ్వంభర సైతం జులై నెలలోనే రిలీజ్ కానుందని భోగట్టా. కింగ్ డమ్ సితార బ్యానర్ సినిమా కాగా తమ్ముడు ఎస్వీసీ బ్యానర్ సినిమా అనే సంగతి తెలిసిందే. మిగతా రెండు భారీ బడ్జెట్ సినిమాలు యూవీ క్రియేషన్స్ బ్యానర్ సినిమాలు కావడం గమనార్హం. ఈ సినిమాలలో కనీసం రెండు సినిమాలు భారీ హిట్లుగా నిలిచే ఛాన్స్ ఉంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాలపై ఒకింత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసింది. ఆ మొత్తం రికవరీ కావాలంటే ఘాటీ, విశ్వంభర యునానిమస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవాలి. ఈ సినిమాలు ఇతర భాషల్లో సైతం రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఘాటీ సినిమాకు క్రిష్ దర్శకుడు కాగా విశ్వంభర సినిమాకు మల్లిడి వశిష్ట దర్శకుడు కావడం గమనార్హం.
ఈ ఇద్దరు దర్శకులకు సైతం ఈ సినిమాలు సక్సెస్ సాధించడం ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు దర్శకులు కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ బడ్జెట్ సినిమాల సక్సెస్ కీలకం కాగా ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాల్సి ఉంది. టాలీవుడ్ కు ఈ ఏడాది ఎంతమేర కలిసొస్తుందో చూడాలి. మెగాస్టార్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.