
నాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో తెలిసిందే. హిట్ 3 సినిమా సినిమా సాధించిన వసూళ్లు చూసి టాలీవుడ్ లో స్టార్ హీరోలు పెద్ద హీరోలు సైతం షాక్ అయ్యారు. నాని రేంజ్ ... నాని సినిమాలో వసూళ్లు ఎలా పెరుగుతున్నాయో చెప్పేందుకు హిట్ 3 సినిమా నిదర్శనం. హిట్ 3 తో నాని తన విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోని నాని నుంచి తర్వాత రాబోతున్న మరో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇదిలా ఉంటే ప్యారడైజ్ సినిమా రికార్డు బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. సరిగమ మ్యూజిక్ లేబుల్ వారు ఏకంగా రు. 18 కోట్లు చెల్లించి ఈ సినిమా ఆడియో రైట్స్ సొంతం చేసుకున్నారట. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ప్యారడైజ్ ఆడియో హక్కులు ఏకంగా 18 కోట్లు పలకటం ఇప్పుడు సినివర్గాలలో వైరల్ గా మారింది. ఇది చూసి స్టార్ హీరోలు సైతం అంతర్గతంగా చర్చించుకుంటున్నారని భోగట్టా..?
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు