సమంత రాజ్ నిడిమోరు త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే రాజ్ నిడిమోరు సమంతతో డేటింగ్ లో ఉన్నారు అనే వార్తలు గత ఐదు,ఆరు నెలల నుండి విపరీతంగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ దే పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. అయితే శ్యామలీ దే తన సోషల్ మీడియా ఖాతాలో నాకు సపోర్ట్ చేస్తున్న వారందరినీ ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా.. వారందరికీ నా ఆశీర్వాదాలు ఎప్పడికీ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ పెట్టడం వెనుక సమంత రాజ్ ల రిలేషన్ అని తెలుస్తోంది. 

సమంత రాజ్ లు డేటింగ్ లో ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్న టైం లో చాలామంది రాజ్ మొదటి భార్యకు సపోర్ట్ చేస్తున్నారు అందుకే శ్యామలీ దే ఈ పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది.అయితే త్వరలోనే రాజ్ నిడిమోరు సమంతలు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రతిసారి రాజ్ తో కలిసి ఉంటూ అభిమానులకు హింట్స్ ఇస్తుంది సమంత. ఇందులో భాగంగా తాజాగా శుభం సినిమా విడుదలై హిట్ అయ్యాక సమంత రాజ్ నిడిమోరు భుజంపై తలవాల్చి మరీ ఓ పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటో చూసి చాలామంది జనాలు డౌటే లేదు..

సమంత రెండో పెళ్లి గురించి ఈ విధంగా హింట్స్ ఇస్తుంది అని కామెంట్లు పెట్టారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా సమంత రాజజ్ నిడిమోరు ల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండింగ్ అవుతోంది.అదేంటంటే సమంత రాజ్ నిడిమోరులు పెళ్లయ్యాక కొత్త కాపురం పెట్టడం కోసం ఒక లగ్జరీ ఇల్లు ని కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక మంచి ఫ్లాట్ కోసం వెతికే పనిలో పడ్డారట. ప్రస్తుతం సమంత రాజ్ నిడిమోరులు ఇద్దరు ఫ్లాట్ వేటలో పడ్డారని, సోషల్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది.అంతేకాదు పెళ్లయ్యాక వాళ్లు ఆ కొత్తింట్లోకి గృహప్రవేశం చేస్తారని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: