
ఇదిలా ఉండగా.. హీరో రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని పొందారు. లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో నటుడు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఇటీవలే ప్రతిష్టించారు. ఇకపోతే రామ్ చరణ్ మొదటి చిరుత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మగధీర సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆరెంజ్, గోవిందుడు అందరివాడేలే, ఎవడు, ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ , రచ్చ, చిరుత, నాయక్, దృవ వంటి సినిమాలలో నటించారు.
అయితే అందరూ నటీనటుల లాగే అందంగా కనిపించడం కోసం రామ్ చరణ్ కూడా సర్జరీ చేసుకున్నారు. రామ్ చరణ్ సర్జరీపై రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ కి దవడ సరిగ్గా ఉండదని స్పష్టం చేశారు. దాన్ని సెట్ చేయించడం కోసం ఆపరేషన్ కూడా చేయించారని ఆయన అన్నారు. రామ్ చరణ్ ని హీరోగా చూడాలని వాళ్ళమ్మ సురేఖ.. రామ్ చరణ్ కి కరాటే, డాన్స్ నేర్పించిందని చెప్పుకొచ్చారు. మగధీర సినిమాతో చెర్రీ సూపర్ స్టార్ అయ్యాడని ఆయన అన్నారు.