
అయితే ఈ సినిమా ఫలితాలు కూడా ఆమెను నిరాశ పరిచాయి. 2023లో `ఐ ప్రేమ్ యు` అంటూ మరాఠీలో కయాదు అదృష్టాన్ని పరిక్షించుకున్నా.. ఆమెకు కలిసి రాలేదు. అదృష్టం ఏంటంటే.. వరుస పరాజయాలు పలకరించినప్పటికీ కయాదు లోహర్ కు తెలుగులో మినహా మిగతా భాషల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలా తమిళంలో `డ్రాగన్` మూవీకి ఎంపిక అయింది. పదీన్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ కామెడీ డ్రామా 2025 ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. సేమ్ టైటిల్ తో తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద డ్రాగన్ హిట్ గా నిలిచింది.
అదే సమయంలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన కయాదు లోహర్ తెలుగు, తమిళ భాషల్లో భారీ పాపులరిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా తన గ్లామర్ తో యువతరం గుండెల్లో కాకరేపింది. దీంతో రెండు భాషల్లోనూ కయాదుకు ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న `ది ప్యారడైజ్`లో నానికి జోడిగా కయాదు ఎంపిక అయినట్లు భారీగా ప్రచారం జరుగుతోంది. అలాగే అటు తమిళంలో అధర్వ, జి వి ప్రకాష్ కుమార్ వంటి హీరోలతో కలిసి సినిమాలు చేస్తోంది. మరోవైపు శింబు 49వ చిత్రంలో కయాదును తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనూ కయాదును హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో కయాదు ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ ను పెంచేసిందట. డ్రాగన్ చిత్రానికి ఆమె మొదట అందుకున్న పారితోషికం జెస్ట్ రూ. 30 లక్షలు. సినిమా సూపర్ హిట్ కావడంతో ఆదనంగా మరో రూ. 70 లక్షలు ఇచ్చారట. ఇక డ్రాగన్ హిట్ తర్వాత కయాదు ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలో టాక్ నడుస్తోంది. దీంతో కయాదు మరీ ఓవర్ చేస్తుందని.. ఒక్క హిట్‌కే అంత పెంచేయాలా అంటూ సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంలో తప్పు లేదు కదా!