టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పో యే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరో ల లో చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున ముందు వరుసలో ఉంటారు . వీరు కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది . ఇప్పటికి కూడా వీరు అదిరిపోయే రేంజ్ లో కెరీర్ను ముందుకు సాగిస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణుల లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ బ్యూటీ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ సరసన నటించింది. కానీ నాగార్జున సరసన నటించలేదు.

నాగార్జున సరసన రెండు సార్లు నటించే అవకాశం కాజల్ కి వచ్చిన కూడా అనుకోని పరిస్థితుల వల్ల ఈమెకు నాగార్జున తో నటించే అవకాశం దక్కకుండా పోయింది. కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున "రగడ" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనుష్క , ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ లో ప్రియమణి స్థానంలో కాజల్ ను తీసుకోవాలి అనుకున్నారట. అంతా ఓకే అయ్యాక చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో కాజల్ ను కాకుండా ప్రియమణిని హీరోయిన్గా ఎంచుకున్నారట.

నాగార్జున హీరో గా రూపొందిన ది ఘోస్ట్ మూవీ లో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. మొదట ఈ మూవీ లో హీరోయిన్ గా కాజల్ ను అనుకున్నారు. ఆల్మోస్ట్ అంతా ఓకే అనుకునే సమయంలో కొన్ని కారణాల వల్ల కాజల్మూవీ నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో సోనాల్ చౌహాన్ ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారట. ఇలా రెండు సార్లు నాగార్జున తో నటించే అవకాశాన్ని కాజల్ మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: