
అయితే ఈసారి మాత్రం విశాల్ పెళ్లి వార్తలకు ప్రాధాన్యత సంతరించుకుంది. `నడిగర్ సంఘం` బిల్డింగ్ పూర్తయిన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో ప్రకటన చేశాడు. ఇటీవలె ఆ బిల్డింగ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. మరో రెండు నెలల్లో బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి సంగతేంటని తాజాగా మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన విశాల్ ను మీడియా ప్రశ్నించింది.

తాజాగా విశాల్ నుంచి పెళ్లి ప్రకటన రావడంతో.. ఆయనకు లైఫ్ పార్ట్నర్ కాబోయేది సాయి ధన్షికనే అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు త్వరలోనే విశాల్-సాయి ధన్షిక ఎంగేజ్మెంట్ జరగనుందని.. సెప్టెంబర్ లో పెళ్లి ఉండొచ్చనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. విశాల్ సన్నిహిత వర్గాలు సైతం ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నాయట. మరి ఈ వార్తలను విశాల్, సాయి ధన్షిక కన్ఫార్మ్ చేస్తారా.. లేదా.. అన్నది చూడాలి.