
అయితే ఈ మూడు క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ మాత్రం ఫుల్ గా యానిమేషన్ తో చిత్రీకరించబోతున్నారట . అంటే అల్లు అర్జున్ ని అనిమేషన్లో చూపించబోతున్నామనమాట. ఆ పాత్ర టూ స్పెషల్ గా ఉండబోతుంది అని .. అల్లు అర్జున్ లైఫ్ లో ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేసి ఉండరని ..ఇకపై చేయబోరు అని కూడా మూవీ మేకర్స్ దగ్గర నుంచిఓ న్యూస్ బయటకు వచ్చింది . అంతేకాదు ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 150 కోట్లు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసుకున్నారట . దానికి తగ్గట్టే సినిమా కోసం కష్టపడుతున్నాడు అల్లు అర్జున్ అంటూ కూడా టాక్ వినిపిస్తుంది.
కాగా గతంలో ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ ని కొన్ని యానిమేటెడ్ సీన్స్ లో చూపించి రెబెల్ ఫాన్స్ ని హర్ట్ చేశాడు డైరెక్టర్ ఓం రావత్. ఒకవేళ అదే విధంగా అట్లీ కూడా నాసిరకమైన ఆనిమేటెడ్ సీన్స్ తెరకెక్కిస్తే మాత్రం సినిమా టాక్ మొత్తం రివర్స్ అయిపోతుంది . కోట్ల బడ్జెట్ పెట్టి తెరకెక్కించిన సినిమాకి రూపాయి కూడా లాభం రాదు . అప్పుడు చేతుల్లో చిప్పే మిగులుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు కొంతమంది యాంటీ బన్నీ ఫ్యాన్స్. మరి కొంతమంది మాత్రం అట్లీ ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల రిజల్ట్ చూసి ఏ పనైనా నీట్ గా క్లియర్ గా చేస్తాడు అని అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో వచ్చే ఈ సినిమా వేరే లెవెల్ కలెక్షన్ సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???