అల్లు అర్జున్ .. టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే వన్ ఆఫ్ ద బడా హీరో.  ఆ మాటకొస్తే ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు అంటే పట్టుమంటూ ఐదు పేర్లు వినపడతాయి . ఆ ఐదు పేర్లలో కచ్చితంగా టాప్ త్రీ నేమ్‌స్ లో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పేరు ఉంటుంది . మరి అలాంటి స్టార్ హీరో తెలిసి తప్పు చేస్తున్నాడా..? తెలియక తప్పు చేస్తున్నాడా ..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . కొంతమంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కావాలనే తప్పు చేస్తున్నాడు అని ఆయనకు హెడ్ వెయిట్ పెరిగిపోయింది అని ఘాటుగా మాట్లాడుకుంటున్నారు. పుష్ప2 సినిమా తర్వాత ఆయనకు ఈ రేంజ్ వచ్చింది అని అనుకుంటున్నాడు అని ..అసలు ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ రావడానికి కారణం మెగా ఫ్యామిలీ అన్న సంగతి మరిచిపోయాడు అని ఘాటుగాటుగా మళ్ళీ వార్ కంటిన్యూ చేస్తున్నారు.
 

సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పని హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ పెద్ద తప్పు చేయలేదు. ఆ మాటకొస్తే అల్లు అర్జున్ చేసింది కరెక్టే . తన పని తాను చేసుకునిపోయాడు . తన ఫ్రెండ్ కి విష్ చేశాడు.  నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు.  ఆ సందర్భంగా తారక్ ని ముద్దుగా బావ అంటూ పిలుస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు . అందులో పెద్ద బూతు లేదు.. తప్పు అంతకన్నా లేదు. కానీ కొంతమంది మాత్రం అల్లు అర్జున్ పై మండిపడుతున్నారు . మా చరణ్ బర్త డే కి విష్ చేయలేదు . మా చరణ్ కి విష్ చేయకుండా ఎన్టీఆర్ కి ఎందుకు విష్ చేసావ్ ..? కళ్ళు నెత్తికెక్కాయా..? నువ్వు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నావంటే కారణం మెగా ఫ్యామిలీనే.. ఆ కృతజ్ఞతలు మర్చిపోకు అంటూ నోటికి వచ్చిన పదాజాలంతో ఘాటు ఘాటుగా కౌంటర్ లు వేస్తున్నారు.


కొంతమంది దారుణాతి దారుణంగా చదువుకున్నావుగా ..కామన్ సెన్స్ లేదా అంటూ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . చరణ్ కి విష్ చేయకుండా జూనియర్ ఎన్టీఆర్ కి విష్ చేస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు  అనేది నీకు తెలియదా..?  తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా తారక్ కి విష్ చేశావ్..? నీకు అంత ప్రేమ ఉంటే పర్సనల్గా చేసుకోవచ్చుగా అంటూ మండిపడుతున్నారు . సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ పై బన్నీ ఫ్యాన్స్ కూడా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. బన్నీకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ..బన్నీ లైఫ్ బన్నీ ఇష్టం ..ఎంత మెగా ఫ్యామిలీ సపోర్ట్ చూసుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయనలో టాలెంట్ ఉంటేనే స్టార్ గా ఎదగగలడు . స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ మెగా ఫ్యామిలీ ఇవ్వలేదుగా.. జనాలు ఇచ్చారు . జనాలు అంతలా బన్నీని లైక్ చేశారు కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు . అయినా బన్నీ ఆర్మీను మర్చిపోకండి అంటూ మరోసారి ఘాటుగా బెదిరిస్తున్నారు . సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఇప్పుడు తారక్ కి విష్ చేయడం పెద్ద రాద్ధాంతంగా మారిపోయింది..!



మరింత సమాచారం తెలుసుకోండి: