కొన్ని సంవత్సరాల క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన నిర్మాతలు ఎక్కువ శాతం స్టార్ హీరోలతో , మీడియం రేంజ్ హీరోలతో సినిమాలను నిర్మించడానికి అత్యంత ఉత్సాహం చూపిస్తూ ఉండేవారు. అందుకు ప్రధాన కారణం స్టార్ హీరోలు మరియు మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు రావడం. వారు నటించిన సినిమాలకు ఎక్కువ శాతం లాభాలు రావడంతో వారితో సినిమాలను చేయడానికి ప్రొడ్యూసర్స్ అత్యంత ఆసక్తిని చూపించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. స్టార్ హీరోలా సినిమాలకు బడ్జెట్లు చాలా ఎక్కువ అవుతున్నాయి.

దానితో రిస్కు భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు నటించిన సినిమాలకి యావరేజ్ టాక్ ను తెచ్చుకున్నా కూడా నిర్మాతలకు పెద్ద మొత్తంలో లాభాలు రావడం లేదు. ఇక మీడియం రేంజ్ హీరోలలో ఒకరు , ఇద్దరిని మినహాయిస్తే చాలా మంది నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. వాటితో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలు కూడా వస్తున్నాయి. ఇక చిన్న సినిమాల ద్వారానే ఈ మధ్య కాలంలో నిర్మాతలు పెద్ద ఎత్తున లాభాలు అందుకుంటున్నారు. ఏదైనా కొత్త పాయింట్ను తీసుకొని దానిని సరికొత్తగా చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినట్లయితే చిన్న సినిమాలను ప్రేక్షకులు అత్యంత ఆదరిస్తున్నారు. ఇక చిన్న సినిమాలకు బడ్జెట్ తక్కువ అవుతుంది. ఒక వేళ సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందకపోయినా నిర్మాతలకు పెద్ద స్థాయిలో నష్టం ఉండదు.

అదే సినిమాకు ప్రేక్షకదరణ బాగా దక్కినట్లయితే అద్భుతమైన లాభాలు నిర్మాతలకు అందే అవకాశం ఉంటుంది. దానితో అనేక మంది స్టార్ నిర్మాతలు కూడా తక్కువ బడ్జెట్లో చిన్న సినిమాలను నిర్మించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో అనేక చిన్న సినిమాలు నిర్మాతలకు భారీ మొత్తంలో లాభాలను అందించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: