టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు . ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించా డు . ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడిగా సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటివరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇకపోతే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే దానిపై పెద్దగా క్లారిటీ లేదు. కానీ అనేక మంది క్రేజీ దర్శకులు రాజమౌళితో సినిమా తర్వాత మహేష్ తో మూవీ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది అని మూవీ ని తెరకెక్కిస్తున్న బుచ్చిబాబు సనా తన తదుపరి మూవీ ని మహేష్ బాబు తో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మహానటి మూవీ తో సూపర్ సాలిడ్ విజయాన్ని సంపాదించుకొని కల్కి 2898 AD సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ కూడా తన తదుపరి మూవీ ని మహేష్ తో చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తర్వాత మహేష్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: