తాజాగా జరుగుతున్న 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film festival 2025) సందర్భంగా, జాన్వీ కపూర్ తొలిసారి రెడ్ కార్పెట్‌పై తన అందంతో కుర్ర హృదయాలను దోచుకుంది. ఆమె ధరించిన ముత్యాల బీడ్స్‌తో డిజైన్ చేసిన పొడవాటి లెహంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని రూపొందించిన ఈ డ్రెస్‌లో జాన్వీ సంప్రదాయాన్ని, ఆధునికతను కలిపి అలరించింది. ఈ ప్రదర్శన ద్వారా జాన్వీ తన ఫ్యాషన్ భిన్నతను మరోసారి ప్రదర్శించింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. "78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హోమ్‌బౌండ్" అనే క్యాప్షన్ ఇచ్చింది.

ఇక ఈ జాన్వీ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమెను భారతీయ మత్స్యకన్యలా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు సాంప్రదాయాన్ని గ్లామర్‌గా ప్రదర్శించిన అరుదైన నటి అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే, అమ్మని మించిన నటిగా ఎదుగుతుందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

జాన్వీకి తొలి సినిమాలో నటించిన కో-స్టార్ ఇషాన్ ఖట్టర్ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో పాల్గొనడం విశేషం. ఇషాన్, జాన్వీ ఇద్దరూ బాలీవుడ్‌ తరఫున అంతర్జాతీయ వేదికపై మెరిచారు. ప్రస్తుతం జాన్వీ టాలీవుడ్‌లో రెండు భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర 2 సినిమాలో తంగం పాత్రలో జాన్వీ కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుందని సమాచారం.

మొత్తంగా జాన్వీ కపూర్ తన తొలి కేన్స్ ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియుల్ని, అభిమానులను ఆకట్టుకుంది. ఆమెలో ఉన్న నటి, ఫ్యాషన్ ఐకాన్, గ్లామర్ క్వీన్ అన్న మూడూ కలగలిపి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే భేదం లేకుండా జాన్వీ జెట్ వేగంతో కెరీర్‌లో దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: