భార్యాభర్తలు విడిపోతే భరణం కింద భర్త దగ్గర నుండి భార్య ఎంతో కొంత ఆస్తిపాస్తులను,డబ్బులను భరణంగా తీసుకుంటుంది. అలా ఇప్పటికే విడాకులు తీసుకున్న చాలా మంది జంటలు ఇలా భరణం కింద భర్త నుండి ఎంతో కొంత సహాయాన్ని సహాయాన్ని పొందుతూన్న వారే. అయితే సెలబ్రెటీలలో చాలామంది విడాకుల తర్వాత వారి భార్యలకు కాస్ట్లీ భరణాలను ఇస్తూ ఉంటారు.అలా స్టార్ సెలెబ్రిటీలు అయితే భార్యలకు ఏకంగా వందల కోట్లను భరణంగా ఇస్తారు. అయితే తాజాగా జయం రవి ఆర్తి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్న వేళ జయం రవి నుండి ఆర్తి భారీగా భరణాన్ని డిమాండ్ చేసింది. ఆర్తి డిమాండ్ చేసిన భరణం చూసి చాలామంది నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. 

మరి ఇంతకీ ఆర్తి తన భర్త నుండి ఎంత భరణాన్ని ఆశించిందో తెలుసా..అక్షరాల 40 లక్షలు.. ఏంటి 40 లక్షలా మరి ఇంత చీపా అనుకుంటారు చాలామంది. కానీ ఆమె 40 లక్షలు అడిగింది ఒక్క నెలకే.. తనకు భరణం కింద ప్రతి నెల 40 లక్షల ఇవ్వాలి అని ఆర్తి తన పిటిషన్ లో చెప్పింది.ఇక ఈ పిటిషన్ పరిశీలన లోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు ఆర్తి దాఖలు చేసిన పిటిషన్ పై జయం రవి జూన్ 12 లోపు క్లారిటీ ఇవ్వాలి అంటూ తేల్చి చెప్పింది.దీంతో జూన్ 12 లోపు జయం రవి ఆర్తికి నెలకు 40 లక్షలు భరణం కింద ఇవ్వడానికి ఒప్పుకుంటారా..లేదా అని చాలామందిలో ఒక ఆతృత ఉంది.

ఎందుకంటే ఇప్పటికే జయం రవి చాలాసార్లు ఆర్తి నన్ను డబ్బు కోసమే వాడుకుందని, నేను సంపాదించిన ఆస్తిపాస్తులు అన్ని ఆమె, ఆమె కుటుంబ సభ్యులే వాడుకున్నారని చెప్పారు.ఇలాంటి వేళ నెలకు 40 లక్షల భరణాన్ని ఆశిస్తే ఆయన ఒప్పుకుంటారో లేదో చూడాలి.ఇక తాజాగా ఆర్తి వేసిన పిటిషన్ పై కొంత మంది నెటిజన్స్ షాక్ అయిపోతున్నారు. ఇన్ని రోజులు నా భర్త లేకుండా నేను బతకలేను అన్నట్లుగా మాట్లాడి ఇప్పుడేమో భరణం కింద లక్షలు లక్షలు డిమాండ్ చేస్తున్నావా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.కానీ మరి కొంతమందేమో ఆర్తికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వారికి ఖర్చులకోసం ఆమె అంత భరణాన్ని ఆశించడంలో తప్పులేదు అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: