టాలీవుడ్ లో ఉన్న స్టార్ కమెడియన్స్ లో హర్ష చెముడు ఒకరు. `వైవా` అనే షార్ట్ ఫిల్మ్ తో గుర్తింపు సంపాదించుకున్న హర్ష.. ఆ తర్వాత 2013లో `మసాలా` మూవీతో వెండితెరపై అడుగు పెట్టాడు. కెరీర్ తొలినాళ్లలో హీరోలకు ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో అలరించిన హర్ష.. ఆపై కమెడియన్ గా మారాడు. తనదైన కామెడీ టైమింగ్, హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు.


మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్ హీరోల వ‌ర‌కు అంద‌రి సినిమాల‌కు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. కమెడియన్ గా సత్తా చాటుతూనే 2024 లో `సుందరం మాస్టర్` చిత్రంతో హర్ష హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ.. హర్ష ప్రయత్నానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా హర్ష దూసుకుపోతున్నాడు.


ఇదిలా ఉండగా.. తాజాగా వైవా హర్ష ఓ లగ్జరీ కారులో కొనుగోలు చేశాడు. కారు ధర ఎంతో తెలిస్తే హీరోలు కూడా వేస్టే అంటారు. సహజంగానే హర్షకు కార్లు, బైకులపై మక్కువ ఎక్కువ. ఇప్పటికే అతని గ్యారేజ్‌లో కొన్ని ఖ‌రీదైన స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. తాజాగా వాటి చెంత మరో లగ్జరీ కారును హ‌ర్ష చేర్చాడు. బీఎండబ్ల్యూ ఎఫ్87 ఎమ్2 కాంపిటీషన్ కారును అత‌ను కొనుగోలు చేశాడు. ఈ శుభ‌వార్త‌ను హ‌ర్ష సోష‌ల్ మీడియా ద్వారా స్వ‌యంగా పంచుకున్నాడు. అలాగే కొత్త కారు ప‌క్క‌న భార్య‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను కూడా పంచుకున్నాడు. ఇక ధ‌ర విష‌యానికి వస్తే.. హైదరాబాద్ మార్కెట్ ప్ర‌కారం హ‌ర్ష కొనుగోలు చేసిన కారు ధ‌ర రూ. 1.3 కోట్లు నుంచి 1.4 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: