సాధార‌ణంగా కొన్ని చిత్రాలు థియేట‌ర్స్ లో ఫ్లాప్ అయిన కూడా ఓటీటీలో మంచి ఆద‌ర‌ణ సొంతం చేసుకుంటూ ఉంటాయి. అలా ఈ ఏడాదిలోనే అతి పెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచిన ఓ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇంత‌కీ ఆ సినిమా ఏంటో తెలుసా.. `సికంద‌ర్‌`.  ఏఆర్ మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన రీసెంట్ యాక్ష‌న్ మూవీ ఇది.


ఈ చిత్రంలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్లుగా చేశారు. దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన సికంద‌ర్ ను రంజాన్ కానుక‌గా మార్చి 30న విడుద‌ల చేశారు. అయితే అవుట్ డేటెడ్ స్టోరీలో వ‌చ్చిన సికంద‌ర్ సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు కూడా విసుగు పుట్టించింది. ఇదేం సినిమా రా బాబు అంటూ థియేట‌ర్స్ లో జ‌నాలు త‌ల ప‌ట్టుకున్నారు. మినిమమ్ అంచనాలను కూడా అందుకోలేక మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకుంది.


స‌ల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎలాగోలా 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ను దాటిన‌ప్ప‌టికీ.. ఫుల్ ర‌న్ లో బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయితే సికంద‌ర్ మూవీ మే 25 నుండి ప్రముఖ దిగ్గ‌జ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వ‌చ్చింది. హిందీతో స‌హా మొత్తం మూడు భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్విస్ట్ ఏంటంటే.. థియేట‌ర్స్ లో దారుణ‌మైన ఫ‌లితాన్ని సొంతం చేసుకున్న సికంద‌ర్ మూవీకి ఓటీటీలో మాత్రం అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభ‌మై వారం రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 చిత్రాల జాబితాలో స‌ల్మాన్ ఖాన్ మూవీ  నంబర్ వన్ స్థానాన్ని కైవ‌శం చేసుకుని దూసుకుపోతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: