తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కుటుంబాలలో మెగా కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుండి అనేక మంది హీరోలు ఉన్నారు. అందులో చాలా మంది ఇప్పటికే సూపర్ గా సక్సెస్ కూడా అయ్యారు. మెగా కుటుంబంలో అందరికంటే కీలకమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఈయన వల్లే ఎంతో మంది మెగా కుటుంబం నుండి హీరోలు ఇండస్ట్రీ కి వచ్చారు. ఇకపోతే చిరంజీవి వల్లే ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఓ వైపు ఆనందంలో , మరో వైపు నిరుత్సాహంలో ఉన్నట్లు తెలుస్తోంది. అది ఎందుకు అనుకుంటున్నారా ..? చిరంజీవి చాలా కాలం క్రితం విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈ మూవీ అత్యంత భారీ గ్రాఫిక్స్ సినిమాగా రూపొందుతూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు స్లో గా జరుగుతుండడంతో ఈ మూవీ విడుదలపై పెద్దగా క్లారిటీ రావడం లేదు. దానితో మెగా ఫాన్స్ నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చిరంజీవి విశ్వంభర మూవీ సెట్స్ పై ఉండగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో మరో మూవీ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ ను కొన్ని రోజుల క్రితమే స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.

సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ కచ్చితంగా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దానితో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్టు తెలుస్తుంది. ఇలా చిరు చేస్తున్న రెండు సినిమాల్లో ఒక సినిమా ద్వారా మెగా ఫాన్స్ డిసప్పాయింట్ అవుతుంటే , మరో సినిమా ద్వారా ఆనంద పడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: