పవన్ కళ్యాణ్ అభిమానులు ఐదు సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ కు టైం దగ్గర పడుతుంది. ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్‌కు కొన్ని అడ్డంకులు ఏర్పడినట్టు తెలుస్తోంది. అవి క్లియర్ కాకుండా ఈ నెల 12న సినిమా రిలీజ్ అవ్వటం కష్టమే అన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 2020లో స్టార్ట్ అయింది 5 ఏళ్లపాటు సినిమా షూటింగ్ జరిగింది డైరెక్టర్లు మారారు .. కథ మారింది .. సెట్స్ మారాయి ఇంకా చాలా జరిగాయి అనుకున్న దాని కంటే రెట్టింపు బడ్జెట్ అయింది. ఇది నిర్మాతకు తలకు మించిన భారంలా మారింది. బడ్జెట్ రెట్టింపు కావడంతో నిర్మాత రత్నం ఫైనాన్షియర్లను ఆశ్రయించారట. ఒప్పందం ప్రకారం వాళ్లకు సినిమా రిలీజ్ కి ముందుగానే డబ్బు ఇవ్వాల్సి ఉంది. రిలీజ్ ముందు జరిగే థియేటర్ బిజినెస్ నుంచి వచ్చే డబ్బుతో ఫైనాన్షియల్ అమౌంట్ క్లియర్ చేయాలని అనుకున్నారు.


అయితే వీరమల్లు రైట్స్ భారీ రేట్లకు కొనుగోలు చేసేందుకు బయర్లు ముందుకు రావడం లేదని అంటున్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతే బిజినెస్ గురించి అనుకుంటున్నారు. ఫైనాన్షియర్ల‌కు దాదాపు 60 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నిర్మాత రత్నం చాలా కష్టపడ్డారు. చాలా నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ 60 కోట్లు కట్టడం .. అది కూడా బిజినెస్ అవ్వ‌కముందే అంటే రత్నంకు మరింత కష్టమనే చెప్పాలి. మరి ఈ టైంలో పవన్ ఎంత వరకు ఆదుకుంటాడో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: