- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా ల‌లో ముందుగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఈ నెల 12 న థియేట‌ర్ల లోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమా త‌ర్వాత ఈ యేడాది ద‌స‌రాకే ప‌వ‌న్ దర్శకుడు సుజిత్ తో చేస్తున్న భారీ సినిమా ఓజి కూడా ఒకటి. ప‌వ‌న్ వీర‌మ‌ల్లు సినిమా కంటే కూడా ఓజీ సినిమా పై ఫ్యాన్స్ లో సెపరేట్ హైప్ ఉంది. ప‌వ‌న్ ఓజీలో ఫ‌స్ట్ టైం గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. ఇక ఈ సినిమాకి నెలకొన్న హైప్ ఇంకా డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే అదే రేంజ్ లో బిజినెస్ డీల్స్ వ‌స్తున్నాయి. ఫ్యీజులు ఎగిరిపోయే అప్ డేట్ ఏంటంటే నైజాం ప్రాంతంలో ఓజి రికార్డ్ బిజినెస్ చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.


నైజాం ఏరియా లో ఓజి అక్కడ 90 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ప‌వ‌న్ కెరీర్ లో మాత్రం ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డ్. మన టాలీవుడ్ లో ఆల్ టైం రెండో అత్యధిక బిజినెస్ లెక్క ఓజీ క్రియేట్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. దీనిని బ‌ట్టి ఇప్పుడు ఓజి పై క్రేజ్ మాములుగా లేదు. అందుకే ఇంతమొత్తంలో రేట్ ఇచ్చేందుకు కూడా టాప్ నిర్మాతలు సైతం ఉత్సాహంగా ఆసక్తి రెడీ అవుతున్నార‌ట‌.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: