
విజయ్ దేవరకొండ కొత్త సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలని సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండతో ఈ రేంజ్ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ బడ్జెట్ కు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా భారీ స్థాయిలో మైత్రీ నిర్మాతలు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ రికార్డులు క్రియేట్ చేస్తే ఆయన ఖాతాలో మరిన్ని సినిమాలు చేరే అవకాశాలు అయితే ఉంటాయి. విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఆయన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు సైతం ఎక్కువగానే ఉంటున్నాయి.
విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉందనే సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్నారు. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా ఎదిగితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ దేవరకొండ రేంజ్ మరింత పెరిగితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. కింగ్ డమ్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. క్రేజీ బ్యానర్లలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం.