పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ అప్పట్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ తో చాలా కాలం క్రితమే ఒక సినిమా మొదలైనా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.
 
అయితే అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ నటించే సమయంలో ఆ హీరోయిన్ ఖాతాలో వరుస ఫ్లాపులున్నాయి. అయితే శృతి హాసన్ టాలెంట్ ను నమ్మి పవన్ ఛాన్స్ ఇవ్వగా గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్న శ్రీలీలకు సైతం ఈ మధ్య కాలంలో లక్ కలిసిరాలేదు.
 
స్పెషల్ సాంగ్ చేసిన పుష్ప2 సినిమా హిట్టైనా మెజారిటీ సినిమాలు శ్రీలీలకు షాకిచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే అప్పుడు శృతి హాసన్ కు గబ్బర్ సింగ్ సినిమాతో ఏ విధంగా దశ తిరిగిందో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సైతం శ్రీలీలకు అదే విధంగా దశ తిరగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలుస్తోంది.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతో వరుసగా భారీ సినిమాలు నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో సైతం భారీ విజయాన్ని అందుకోవడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం అందుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: