కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకులలో తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన చాలా మంది దర్శకులు ఉన్నారు. అలా తమిళ సినీ పరిశ్రమ నుండి సినిమాలను రూపొందించి ఇండియా వ్యాప్తంగా బాక్సా ఫీస్ ను షేక్ చేసిన దర్శకులలో శంకర్ , మణిరత్నం , ఏ ఆర్ మురుగదాస్ మొదటి వరుసలో ఉంటారు. శంకర్ కెరియర్ ప్రారంభించిన మొదటి సినిమా నుండి అద్భుతమైన విజయాలను అందుకుంటూ అద్భుతమైన స్థాయిలో ఇండియా వ్యాప్తంగా క్రేజ్ను సంపాదించుకున్నాడు. అలాగే మణిరత్నం కూడా ఎప్పుడు వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వాటిలో అనేక మూవీలతో మంచి విజయాలను అందుకుంటూ ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా తనకంటూ సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇక ఏ ఆర్ మురగదాస్ కూడా కమర్షియల్ సినిమాలలో మెసేజ్ ను జోడిస్తూ సినిమాలను రూపొందిస్తూ అద్భుతమైన విజయాలు అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా ఈ ముగ్గురు దర్శకుడు కూడా ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకులుగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ ముగ్గురు వరుస అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. శంకర్ ఆఖరుగా దర్శకత్వం వహించిన ఇండియన్ 2 , గేమ్ చేంజర్ మూవీలు బాక్సా ఫీస్ దగ్గర ఘోర పరాజయాలను ఎదుర్కున్నాయి.

ఈ రెండు సినిమాలతో శంకర్ కెరియర్ చాలా డౌన్ ఫాల్ అయింది. ఇక మణిరత్నం తాజాగా థగ్ లైఫ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి భారీ ఎత్తున నెగిటివ్ టాక్ వచ్చింది. మురగదాస్ కొంత కాలం క్రితం సికిందర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇలా ఒకప్పుడు తమ సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేర్ చేసిన ఈ ముగ్గురు దర్శకులు ప్రస్తుతం మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వెనకబడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: