
సినిమాల పట్ల ఎంతో ఇష్టం - ప్రేమ ఉంటే తప్పిస్తే ఇలాంటి ఫీలింగ్ రాదు. అలాంటి రాంచరణ్ తన సినిమా హిట్ అవ్వాలి అంటూ స్పెషల్గా పూజలు చేయించాడు. ఆ సినిమా మరేంటో కాదు చిరుత . రామ్ చరణ్ కెరియర్ స్టార్ట్ చేసిన మూవీ ఇది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి కొడుకు సినిమాలోకి వస్తున్నాడు అంటే జనాలు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారో అందరికీ తెలుసు .
మొదటి సినిమాలోనే అన్ని చూపించేయాలి అంటూ కోరుకుంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం అలా కాదు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తనలోని ఫ్లాప్స్ ను స్పెషల్ గా మార్చుకోవాలి అంటూ డిసైడ్ అయ్యాడు. ఆ కారణంగానే ఫస్ట్ సినిమాలో తనలోని మాస్ యాంగిల్ ని బయట పెట్టాడు . అయితే ఈ సినిమా రిలీజ్ మూమెంట్లో రామ్ చరణ్ బాగా టెన్షన్ పడిపోయారట . ఫస్ట్ సినిమా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటూ చాలా చాలా టెన్షన్ పడ్డారట . అంతేకాదు సురేఖ-చిరంజీవి కలిసి ప్రత్యేకంగా ఈ సినిమా హిట్ అవ్వాలి అంటూ పూజలు కూడా చేయించారు అంటూ అప్పట్లో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . మరొకసారి ఈ న్యూస్ వైరల్ అవుతుంది. రాంచరణ్ తన సినిమాల విషయంలో ఎప్పుడూ కూడా చాలా చాలా పర్ఫెక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అంటున్నారు మెగా అభిమానులు..!