సీనియర్ ఎన్టీఆర్ భార్య బసవతారకం అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ భార్యగా బసవతారకం కి ఎంతో మంచి గుర్తింపు ఉంది. అలాగే బాలకృష్ణ తన తల్లి క్యాన్సర్ తో మరణించడంతో తన తల్లి పేరు మీద బసవతారకం హాస్పిటల్ ని కూడా ఓపెనింగ్ చేశారు. అయితే అలాంటి బసవతారకం సీనియర్ ఎన్టీఆర్ అనే సంగతి మనకు తెలిసిందే.. ఎన్టీఆర్ భార్యగా ఆమె ఎంతో అనుకువగా ఉండేది. భర్త అంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఆమెలో ఇసుమంత గర్వం కూడా ఉండకపోయేదని బసవతారకం ని దగ్గరి నుండి చూసిన చాలామంది అంటూ ఉంటారు. అయితే అలాంటి బసవతారకం చూసి సీనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేసే ఓ హీరోయిన్ తెగ భయపడిపోయేదట. బసవతారకం షూటింగ్ సెట్ కి వస్తుంది అంటే చాలు ఆమె ఎక్కడో లోపల వెళ్లి దాక్కునేదట.

మరి బసవతారకం కి భయపడే ఆ స్టార్ హీరోయిన్ ఎవరు..ఎందుకు బసవతారకంను చూసి అంతలా వణికిపోయేది అనేది ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ జరిగితే ఆ షూటింగ్ కి ఎన్టీఆర్ కి ఇంటి నుండి భోజనం వచ్చేదట. అయితే ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా ఇంటి భోజనమే తినేవారు. అలా రామకృష్ణ స్టూడియోలో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో బసవతారకం స్వయంగా వంట చేసుకొని తీసుకువచ్చిందట.అయితే అదే షూటింగ్ సెట్లో తనతో పాటు కలిసి నటించే ఊర్వశి శారద కూడా ఉంది.ఆమెను కూడా పిలువు అని సీనియర్ ఎన్టీఆర్ బసవతారకం కి చెప్పడంతో ఊర్వశి శారద ఎక్కడ ఉందా అని షూటింగ్ సెట్ అంతా వెతికిందట బసవతారకం.

ఇక అక్కడే ఉన్న కొంతమంది బసవతారకం గారు మిమ్మల్ని వెతుకుతున్నారు అని శారదకు చెప్పడంతో ఆమె భయపడి పోయి ఆవిడ నన్ను వెతకడం ఏంటి అని అనుకుందట. ఆ తర్వాత బసవతారకం కలిసి ఏంటమ్మా మీరు నాకోసం వచ్చారు.. నేనే మీ దగ్గరికి వచ్చేదాన్ని కదా.. అని భయం భయంగా మాట్లాడిందట.కానీ ఎవరు వస్తే ఏంటి అందులో తప్పేముంది అని బసవతారకం ఎంతో ఆప్యాయంగా మాట్లాడిందట. అయితే బసవతారకం ఆప్యాయంగా మాట్లాడినప్పటికీ ఆవిడ నాకోసం రావడం నాకు చాలా భయమేసింది అంటూ గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ఊర్వశి శారద చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: