
అందంగా ఉంటాడు ..చక్కగా మాట్లాడుతాడు.. ఒకరిని హార్ట్ చేయడు..కాంట్రవర్షియల్ జోలికి పోడు.. తన పని తాను చేసుకునిపోతాడు . ఇంతవరకు ఇలాంటి కామెంట్స్ నే వినిపించేటివి . కానీ ఇప్పుడు మాత్రం మానస్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ ఫ్యాన్స్ . దానికి కారణం ఆయన నోటి దూలతో చేసిన కామెంట్స్ అంటూ కూడా మాట్లాడుతున్నాడు . సీరియల్ నటుడు మానస్ ఓ విషయంలో జాన్వి పేరు చెప్పడంతో అది కాస్త వైరల్ గా మారింది . అది జాన్వి కపూర్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది .
సీరియల్స్ , బిగ్ బాస్ పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మానస్ ఇటీవల.. ఆహా కాకమ్మ కథలు షో కి వచ్చారు . చాలా సరదాగా ఎంటర్టైన్ చేశారు. ఇదే షోలో హోస్ట్ తేజశ్వీ మదివాడ "యాక్టింగ్ తక్కువ ఓవర్ యాక్టింగ్ ఎక్కువ " అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది అని ప్రశ్నించగా వెంటనే మానస్.." జాన్వికపూర్" అంటూ సమాధానం చెబుతాడు . దీంతో ఒక్కసారిగా తేజస్వి కూడా షాక్ అయిపోయింది . అయితే ఈ కామెంట్ కాస్త వైరల్ కావడం తో జాన్వి ఫ్యాన్స్ మానస్ పై ఫైర్ అయిపోతూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. జాన్వి కపూర్ గుంజన్ సక్సేనా.. మిల్లి.. మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలు నువ్వు చూడలేదా ..? తను ఎంత బాగా యాక్టింగ్ చేసిందో నీ కంటికి కనిపించలేదా ..? నీ కళ్ళు దొబ్బాయారా..? అంటూ ఘాటుగా మానస్ ని ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు నిజమే..జాన్వీ కపూర్ కి అసలు అది ఉంటేగా..ఎప్పుడు ఎక్స్ పోజింగే అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మానస్ ఎలా స్పందిస్తాడొ చూడాలి..!