టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చరణ్ ప్రస్తుతం ఉప్పెన మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించి మొదటి మూవీతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా ... కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు.

జగపతి బాబు ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే నాచురల్ స్టార్ నాని , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరోగా నటించనున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత పెద్ది మూవీ బృందం వారు పెద్ది సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

దానితో ది ప్యారడైజ్ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో పెద్ది సినిమా కలెక్షన్లపై ది ప్యారడైజ్ సినిమా ద్వారా ఎఫెక్ట్ పడుతుంది అని చాలా మంది భావించారు. ఇకపోతే ది ప్యారడైజ్ మూవీ విడుదల పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు బలంగా వస్తున్నాయి. దానితో పెద్ది సినిమాకు డోకా లేదు అని , ఒక వేళ పెద్ది సినిమాకు మంచి టాక్ కనుక వస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబట్టడం ఖాయం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: